Sunday, 2 June 2013

నిశ్శబ్ధ చైతన్య విప్లవం లీడ్‌ ఇండియా

నిశ్శబ్ధ చైతన్య విప్లవం

లీడ్‌ ఇండియా



సత్యం బోధించడం కాదు.. గ్రహించబడాలి.. విద్యను బోధించడం కాదు విద్యార్థి పరిశీలనతో నేర్చుకోవాలి.. అంటూ యువ శక్తిని దేశశక్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సుదర్శనాచార్య. మానవతావిలువలపై పరిశోధన చేసి పి.హెచ్‌.డి పొందిన అరుదైన వ్యక్తి ఆయన. విలువలతో కూడిన సమాజమే అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా విశ్వసించే మాజీ రాష్ట్రపతి అబ్దూల్కలాంకు సన్నిహితుడు. ప్రయోగాత్మకవిద్యను అందించే లక్ష్యంతో 'భారత రత్నాస్వ్యాల్యూస్ఎడ్యుటెక్‌' ను స్థాపించి ఒకవైపు సనాతన భారతీయ విద్యా విధానానికి పూర్వవైభవం తెచ్చెలా, మరోవైపు సామాన్యులకు కార్పొరేట్విద్యను అందించనున్నారు. తమ ప్రయత్నం ఫలించి భారతవిద్యాసంస్థలు మరో తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలుగా మారుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తున్న ఆయన లీడ్ఇండియా తోనే తన జీవనయానం ముడిపడి ఉందంటూ.. తన అంతరంగాన్ని వివరించారు.
అమ్మానాన్న నల్లబోయిన లక్ష్మీనర్సమ్మ, సత్తయ్యలకు పెళ్లెయిన చాలా సంవత్సరాల తరువాత పుట్టిన ఏకైక బిడ్డను నేను. దైవానుగ్రహంతో వారి కడుపున జన్మించానని విశ్వసించి నన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచా రు. శాలిబండ ప్రాంతంలో ఆయుర్వేద, ఆధ్యాత్మిక, జ్యోతిష్య శాస్త్రాల్లో మా నాన్న ప్రావీణ్యం కలవారు. ఆయనే నాకు తొలి గురువు.

స్కూల్‌ ఫీజు కోసం అమ్మనాన్న తగవు..

ఐదవ తరగతిలో ఉన్నప్పుడు నా స్కూల్ఫీజు చెల్లించడం కోసం అమ్మానాన్న గొడవ పడిన దృశ్యం నాలో నా జీవనపథాన్ని నిర్దేశించే మార్పు తీసుకువచ్చింది. ఇక మీదట నా చదువు వారికి భారం కావద్దని నిర్ణయించు కుని.. చుట్టుపక్కలవారి ఇళ్లకు వెళ్లి వారి పిల్లలకు ట్యూషన్చెబుతానని, మంచి మార్కులు వస్తేనే ఫీజు ఇవ్వ మని చెప్పాను. అలా నా స్కూల్ఫీజు నేనే సమకూర్చుకున్నాను. నా చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా చూసుకుంటూ.. వారికి చేదోడుగా ఉంటూ వివేకవర్దని స్కూల్లో పదవతరగతి వరకు , బద్రుకా కాలేజీలో పియుసి పూర్తిచేశాను.

రెండు ఉద్యోగాలకు పదవీవిరమణ..

డాక్టర్గా పేదప్రజలకు సేవ చేయాలన్నది నాన్న ఆశ. కానీ, ఒక్క మార్క్తో మెడిసిన్లో సీటు మిస్అయ్యింది. విద్యాసంవత్సరం వృథా చేసుకోవడం ఎందుకని బి.కామ్లో చేరాను. ఫీజుల కోసం జైన్గ్రేప్గార్డె న్లో సూపర్వైజర్గా పనిచేశాను. తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి , ఎంబిఎ పూర్తి చేశాను. కాని, డాక్టర్ను కాలేకపోయాను అన్న బాధ ఉండేది. కనీసం పేరు ముందైన డాక్టర్ను చేర్చుకోవచ్చని పి.హెచ్‌.డి చేశాను.
కేంద్రప్రభుత్వ ఆధీనంలోని ఏజి ఆఫీస్లో పోస్టల్అకౌంటెంట్గా చేరాను. డిపార్ట్మెంట్పరీక్షలు రాసి జూని యర్అకౌంటెంట్ఆఫీసర్గా పదోన్నతి పొందాను. కానీ, ఉద్యోగంతో జీతమైతే వస్తుంది కాని, ఎదో వెలితి. నేను ఎంచుకున్న లక్ష్యం ఇది కాదేమో అన్న భావనతో 1969 నుంచి 1978వర కు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగా న్ని వదిలివేస్తూ.. విఆర్ఎస్తీసుకున్నాను. కుటుంబ ావసరాల కోసం మళ్లిd ఉద్యోగం చేయాల్సి వచ్చింది. 1979 నుంచి 1993 వరకు ఐడిపిఎల్లో సీనియర్అకౌంటెం ట్గా పనిచేశాను . కంపెనీ దివాళా తీయడంతో.. నాకు పనిలేక పోయింది. పనిచేయ కుండా ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం చిన్నతనంగా భావించి స్వచ్ఛం పదవీవిరమణ చేశాను.
ఐదు సంవత్సరాల్లో పదింతలైన విద్యార్థుల సంఖ్య..

ప్రముఖ విద్యావేత్త, సామాజిక సేవావేత్త జి. పుల్లారెడ్డి నాకు అత్యంత ఆత్మీయుడు, సన్నిహితుడు. ఆయన ప్రారంభించిన ఒయాసిస్స్కూల్ను నిర్వహించడానికి నన్ను ఆహ్వానించాడు. ఉద్యోగం చేయను.. ఐదు సంవత్సరాల పాటు స్కూల్నిర్వహణబాధ్యతలు తీసుకుంటాను.. నా కుటుంబావసరాలకు కావల్సిన మొత్తం పోగా మిగిలిన ధనం ఆయనకే ఇస్తానని చెప్పాను. ఆయన సరే అన్నారు. అలా 1993లో 76మంది విద్యార్థులతో ఉన్న స్కూల్ఐదు సంవత్సరాల్లో 1800మంది విద్యార్థుల కు విద్యాబోధన చేసే స్థాయికి వచ్చింది. అంతే కాకుండా డిగ్రీ, ఫార్మసీ, పిజీ, ఇంజనీరింగ్కాలేజీల ఏర్పాటు, నిర్వహణలో ఆయనకు సహకరించాను. ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో నేను వేరే సంస్థలో చేరే ప్రయత్నాలు చేశాను. అప్పుడు మహదేవ్డాట్కామ్లో చీఫ్ఆపరేటివ్ఆఫీసర్గా నెలకు లక్షన్నర రూపాయలతో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేశాను. డబ్బుకు తప్ప మనిషికి, మాటకు విలువలేని సాఫ్ట్వేర్రంగంలో నేను ఇమడలేనని తెలిసి బయటకు వచ్చాను.
సామాజిక సేవే లక్ష్యంగా..

దేశం నాకేమిచ్చింది అని కాకుండా.. దేశానికి నేను ఏమిచ్చాను.. అనే ఆలోచన ప్రతిక్షణం నన్ను వెంటాడేది. సమాజానికి పనికివచ్చే పని ఏదై నా చేయాలని రెండు సంవత్సరాల పాటు నాకు తీరిక దొరికినప్పుడల్లా గ్రామగ్రామాలు తిరిగాను. స్వామి చిన్మయానంద స్వామి ప్రవచనాలను గ్రామాలకు తీసుకువెళ్లాను. శిథిలమైన ఆలయాలను శుభ్రపరిచి అక్కడ సత్సంగాలు ఏర్పాటుచేశాను. బాల వికాస్కార్యక్రమాలు నిర్వహించాను. వేసవికాలంలో బాలభారతి శిక్షణా తరగతులను గురుకుల పద్ధతిలో ఏర్పాటుచేశాం. లీడ్యూత్క్యాంపస్ను 1991లో ప్రారంభించాం. నైతికవిలువలు పాటిస్తేనే.. సుసంపన్నమైన సమాజాన్ని మనం ఏర్పాటుచేసుకోవచ్చు.. పెద్దలకు విలువలగురించి చెప్పడం, వారు ఆచరించేలా చేయడం అసాధ్యమనిపించింది. అందుకే పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించాలని, సనాతన భారతీయ జీవనసిద్ధాంతాలను ఆచరించి భారతదేశ పూర్వవైభవాన్ని తీసుకురావాలని సంకల్పించాం.

జీనవగతిని మార్చిన సత్యసాయి ప్రసంగాలు..

క్రమంలో పుట్టపర్తి సత్యసాయిబాబా నుంచి ఆహ్వానం వచ్చింది. ఏడు రోజుల పాటు మాన వతావిలువలపై ఆయన చేసిన ప్రసంగాలు నాలోని మాయపొరలను తొలగించాయి. నాకు తెలిసింది చాలా తక్కువని ఎంతో నేర్చుకోవల్సి ఉందని గ్రహించాను. నా శేష జీవితమంతా మానవతా విలువల ప్రచారం కోసమే కేటాయిం చాలని నిర్ణయించుకున్నాను. ధ్యానంలో ఉన్నప్పుడు నేను పయనించాల్సిన మార్గం తెలిసింది. విలువలు బోధించకుండా.. ఆచరణ ద్వారా తోటివారిలో విలువల పట్ల ఆసక్తిని కలిగించడం, ఆచరణకు ప్రోత్సహించడం, ప్రతివ్యక్తిలో విలువలు పొందుపరచాలన్న ఆలోచన వచ్చింది. విలువలు సత్యంతో , ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ,నమ్మకం, ధైర్యంలతో కలిసి శక్తిగా మారి జీవితాన్ని తేజోమయం చేస్తాయి అన్నది శిక్షణ, పరిశోధన ద్వారా తెలిసింది. నా పరిశోధనకు శాస్త్రీయతను జోడించి మానవతా విలువలపై ఉస్మానియా విశ్వ విద్యా లయం నుంచి పి.హెచ్‌.డి పొందాను.

కలాం జీవితం ఆదర్శంగా..


భారతదేశం గర్వించే శాస్త్రవేత్త .పి.జె. అబ్దుల్కలాంను విలువలకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఆయనకు 1997లో భారతరత్న రావడంతో నా దృష్టి ఆయన వైపు మళ్లింది. ఆయన జీవితాన్ని, పెరిగిన విధానాన్ని అధ్యయనం చేశాను. 2002లో ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటివరకు నేను సేకరించిన విషయాలు, కలాంజీ ప్రసంగాల నుంచి గ్రహించిన అంశాలను తీసుకుని ''కలాం కాల్టు ది నేషన్‌ '' అన్న పుస్తకాన్ని రాశాను. జనవరి 04, 2003 ఆయనను కలుసుకుని నేను రాసిన పుస్తకం ఇచ్చాను. 15రోజులు సమయం ఇస్తే చదివి, తన అభిప్రాయం చెబుతానని నా ఫోన్నెంబర్తీసుకున్నారు. సరిగ్గా జనవరి 19, 2003 రాష్ట్రపతి భవన్నుంచి ఫోన్వచ్చింది. 'కలాంజీ మీతో మాట్లాడుతారట' అని చెప్పారు ఆపరేటర్‌.. నాలో ఉద్వేగం.. పుస్తకం గురించి ఎం చెబుతారో అన్న ఆసక్తి.. కలాంజీ ఫోన్లైన్లోకి వచ్చారు.. నా వ్యక్తిగత వివరాలు అడిగారు.. 'పుస్తకం బాగుంది.. కాని, నా తల్లిదండ్రులకు, గురువులకు ఎందుకు అంకితం ఇచ్చావు' అన్నారు. 'మిమ్ముల్ని రత్నంగా చేసి జాతికి అందించింది వాళ్లే కదా'.. అన్నాను.. ఒక్కక్షణం ఆయన మౌనం.. తరువాత 'గొప్పరుణాన్ని నాపై పెట్టావు ఎలా తీర్చుకోను' అన్నారు. 'మనం వేరు అనుకుంటే రుణం.. ఒక్కటే అనుకుంటే.. అనుబంధం' అన్నాను.. 'మిమ్ముల్ని నేను కలుస్తాను'.. అంటూ ఫోన్పెట్టేశారు. అదే సంవత్సరం బాలయోగి స్టేడియం ప్రారంభోత్సవానికి చ్చినప్పుడు వచ్చి కలవమని ఫోన్వచ్చింది. వెళ్లి కలిసాను.. మానవతావిలువలపై చేసిన నా పరిశోధన పూర్తిగా చూశారు. లీడ్యూత్కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. ఆయనే లీడ్ఇండియా 2020 అన్న పేరు పెట్టారు. రానున్న యువతరానికి మార్గ దర్శకంగా ఉండేలా పది సూత్రాల ప్రతిజ్ఞను జనవరి 19, 2004 పంపించారు. అదే ప్రతిజ్ఞను రిపబ్లిక్ఉత్సవాల్లో వందమంది విద్యార్థులతో చేయించారు. అలా కలాంజీ ఆశయాలకు అక్షరాలను అందిస్తూ.. జనవరి 28, 2004 లీడ్ఇండియా జస్టిస్వి. భాస్కరరావు అధ్యక్షతన ప్రారంభమైంది. డాక్టర్కాకర్ల సుబ్బారావు, డాక్టర్.వి.సుబ్బారావు, జె.సి మహంతి తదితరులు సభ్యు లుగాఉన్నారు.

కలాంజీ పది సూత్రాల ప్రతిజ్ఞపై వర్క్‌ షాప్‌.....

జాతి యువతతో ఆయన చేయించిన పదిసూత్రాల ప్రతిజ్ఞపై ఫిబ్రవరి 14, 2004 వర్క్షాప్నిర్వహించాం. అనేకమంది ఐఎఎస్‌, ఎపిఎస్అధికారులతో పాటు విద్యావేత్తలు ఇందులో పాల్గొన్నా రు. ''ఆప్బడో.. దేశ్కి బడావో ''..అన్న నినాదంతో ప్రభుత్వపాఠశాలల్లోని విద్యార్థులకు లీడ్ఇండియా 2020 కోర్సును రూపొందించాం . రాష్ట్రవ్యాప్తంగా అని ్న ప్రభుత్వపాఠశాలల ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేసేలా ప్రభుత్వంతో, లయిన్స్క్లబ్తో ఎంఓయు ుదుర్చుకున్నాం. ప్ర స్తుతం ప్రతిజిల్లాలోని 70 - 100పాఠశాలల్లో కోర్సును అమలు చేస్తూ.. మూడు రోజుల శిక్షణ ఇస్తున్నాం.

ప్రశంసలే తప్ప నిధులు లేవు..

విద్యార్థుల జీవితాలపై ఎంతో ప్రభావం చూపేే లీడ్ఇండియా 2020 కార్యక్రమాలపై ప్రము ఖులు ఎన్నో ప్రశంసల జల్లులు కురిపించారు. కాని, నిధులు లేవు. కనీసం మూడు రోజుల శిక్ష ణా కోర్సును పాఠ్యాంశాలలోనైనా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరాం. కాని, ఎలాంటి స్పందన లేదు. 2020 నాటికి ప్రాజెక్ట్ను పూర్తిచేయాలని తపిస్తున్నాం. ఢిల్లిd, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో శిక్షణలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వపాఠశాలల్లో చదివే విద్యార్థుల సం ఖ్య తగ్గిపోతున్న కారణంగా ప్రైవేటు, కార్పొరేట్పాఠశాలల్లోనూ శిక్షణాకార్యక్రమాలు విస్తరిం చే ఆలోచనలో ఉన్నాం. విశ్వవ్యాప్తంగా ఉన్న అవకాశాలు పొందేలా.. నైపుణ్యాన్ని పెంచుకునేలా ఇప్పటివరకు పదిలక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం. సంవత్సరం చివరినాటికి కోటి మంది లీడ్ఇండియా ప్రతినిధులను తయారుచేయాలన్న లక్ష్యంతో ఉన్నాం.

జ్ఞానకేంద్రాలుగా విద్యాలయాల ఏర్పాటు..



ఉపాధ్యాయులను దేశ భవిష్యనిర్మాతలుగా కలాంజీ పేర్కొంటారు. విద్యార్థుల బుద్ధివికాసానికి, సామాజిక సేవాస క్తికి తరగతిలోనే పునాది పడుతుంది. బాధ్యతగల ఉపాధ్యాయులు దేశప్రగతికి తోడ్పడేలా శాస్త్రీయ జిజ్ఞాసను పెంచి, విశ్వనాయకత్వానికి కావల్సిన లక్షణాలు పెంపొందించుకునేలా విద్యార్థులను తయారుచేస్తారు. దేశ భవిష్య నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుంది. అందుకే విద్యాలయాలను జ్ఞానకేంద్రాలుగా తీర్చిదిద్దు తున్నా . ప్రయోగాత్మక పద్ధతిలో బోధన చేసే విధానాన్ని మూడుసంవత్సరాల పాటు అమెరికాలో పర్యవేక్షిం చాను.

కలాంజీ తో ఈ నెల 20న భారతరత్నాస్‌ ప్రారంభం..

విద్యార్థికి స్వేచ్ఛనిచ్చి.. జి జ్ఞాసతో.. నైపుణ్యాన్ని పెంచుకునే విద్యావిధానం అందించేలా సామాన్యుడికి కార్పొరేట్విద్య అందించాలన్న తపనతో ''భారత్రత్నస్వ్యాల్యూస్ఎడ్యుటెక్‌ (ఇంటర్నేషనల్రెసిడెన్షియల్చైన్స్కూల్స్‌)'' ను ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్లోని లాల్బహదూర్స్టేడియంలో ఫిబ్రవరి 21, 2013 కలాంజీ దీనిని లాంఛనంగా ప్రారంభించారు. ఈనెల 20 బండ్లగూడలోని విద్యాలయ భవనాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలాంజీ ఇంటరాక్ట్అవుతారు. సనాతన భార తీయ విద్యావిధానంలో గురుకుల పద్ధతిలో ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది. ప్రయోగాత్మకంగా రెండుసంవత్సరాల పాటు విద్యాబోధన చేసిన తరువాత వచ్చే ఫలితాలతో ప్రతిజిల్లాల్లోనూ తరహా విద్యాలయాలు ప్రారంభిస్తాం. 2020 నాటికి ఒకవైపు దేశాన్ని ముందుకు నడిపించే యువ నాయకత్వాన్ని, మరోవైపు వ్యక్తిగతాభివృద్ధితో పాటు దేశప్రగతికి పాటుపడే యువసైన్యాన్ని తయారు చేస్తాం. దిశదశ లేకుండా సాగుతున్న విద్యావ్యవస్థకు అతీ తంగా అవగాహన, సృజన, పరిశీలన, పరిశోధనలతో ప్రతివిద్యార్థి భారతరత్నగా ప్రకాశించేలా ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. సామూహిక మార్పుతో నిశ్శబ్ధ చైతన్య విప్లవం సాధిస్తాం
see below link ...



2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. Dear Acharyulu and LeadInDIA2020 members of the organization.This spirit is given me B.Tech degree with proficient manner. Acharya's spirit and blessing is alway with me so that today I standing in the society of human being.Now My contribution to my mother land is to see real values in the society.
      LEADINDIA !!!

      Delete